సుఖం లేని ఈ సంసారమేలా?

ఆపరేషన్ ఆకర్ష్ ను సాధారణంగా ఎందుకు ప్రయోగిస్తారు? మెజారిటీ తక్కువగా ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా బలం పెంచుకునేందుకు, లేదంటే ప్రతిపక్షాన్ని బలహీనపరిచి తమ భారీ సంఖ్యాబలాన్నిప్రదర్శించేందుకు. ఇటీవల టీడీపీ కూడా ఆర్థిక, అధికార బలాన్ని ఉపయోగించి ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. చంద్రబాబే స్వయంగా కండువాలు వేసి బలం పెరిగిందని గర్వపడ్డారు. కానీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో జరిగిన పరిణామాలు చూశాక ఈ మాత్రం దానికి ఆర్థిక వనరులను వృథా చేసుకుని ఎమ్మెల్యేలను […]

Advertisement
Update: 2016-03-16 00:05 GMT

ఆపరేషన్ ఆకర్ష్ ను సాధారణంగా ఎందుకు ప్రయోగిస్తారు? మెజారిటీ తక్కువగా ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా బలం పెంచుకునేందుకు, లేదంటే ప్రతిపక్షాన్ని బలహీనపరిచి తమ భారీ సంఖ్యాబలాన్నిప్రదర్శించేందుకు. ఇటీవల టీడీపీ కూడా ఆర్థిక, అధికార బలాన్ని ఉపయోగించి ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. చంద్రబాబే స్వయంగా కండువాలు వేసి బలం పెరిగిందని గర్వపడ్డారు.

కానీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో జరిగిన పరిణామాలు చూశాక ఈ మాత్రం దానికి ఆర్థిక వనరులను వృథా చేసుకుని ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఏముందని చాలా మంది టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఆర్ధిక బలం కాదు తమ అభివృద్ధి మంత్రాన్ని చూసే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని తమ్ముళ్లు గొప్పగా చెప్పుకున్నారు. తీరా అసెంబ్లీలో అవిశ్వాసం సమయంలో ఎనిమిది మంది పత్తా లేకుండా పోయారు. అసలు ఎక్కడ దాక్కున్నారో కూడా చాలా మందికి తెలియడం లేదు.

నిజంగా టీడీపీ అభివృద్ధినే చూసి వారు వచ్చి ఉంటే ధైర్యంగా సభకు వచ్చి వైసీపీ విప్‌కు వ్యతిరేకంగా ఓటేసేవారు. అప్పుడు అనర్హత వేటు పడినా ఎన్నికలకు వెళ్లి టీడీపీ అభివృద్ధి మంత్రంతో ఈజీగా గెలవాలి. కానీ అలా జరగలేదు. ఆ ఎనిమిది మందిపై అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఏకంగా అసెంబ్లీ నిబంధనలనే క్షణాల్లో మార్చేసి విప్‌జారీకి సమయమే లేకుండా చేసింది అధికారపార్టీ.

అసెంబ్లీలో అవిశ్వాసం అన్నదానికే అర్థం లేకుండా నిబంధనలను మార్చేసినప్పుడు ఇక కొత్తగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది?. ఒకవేళ భవిష్యత్తులో నిజంగా టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి ప్రభుత్వంపై అవిశ్వాసమే పెట్టినా ప్రమాదం ఉండదు. ఎందుకంటే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల గారు లేచి తమకు ఇబ్బంది కలిగించే నిబంధనల తొలగింపుకు ప్రతిపాదిస్తారు. అది మూజువాణీ ఓటుతో ఓకే అయిపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిన వారు డిమాండ్ చేసినా అసలు ఓటింగ్‌కే అనుమతివ్వరు. మూజువాణి ఓటుతో చంద్రబాబుకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించేస్తారు. అలా ప్రభుత్వంపై అవిశ్వాసంలో ఓటింగ్‌కే అనుమతి ఇవ్వనప్పుడు సంఖ్యాబలంతో పనేంటి?. పక్కపార్టీల ఎమ్మెల్యేలను వలవేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది?. మొత్తం మీద ఎనిమిది మందిని తీసుకోవడం వల్ల టీడీపీకి కలిగిన సుఖమేంటో ఆ పార్టీ వారికే తెలియాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News