కోడెల గారి నేరాలు ఇవీ అధ్యక్షా...!

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా వైసీపీ నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి … కోడెల శివప్రసాదరావుపై త్రీవ విమర్శలు చేశారు. కోడెల శివప్రసాదరావు పలు కేసుల్లో నిందితుడని ఆరోపించారు. కోడెలకు గతంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన మాట అవాస్తవమన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం కోడెలను విచారించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో బయటపడ్డారని చెప్పారు. స్పీకర్‌గా అందరి హక్కులను కాపాడాల్సిన కోడెల శివప్రసాదరావు… ఎమ్మెల్యేగా ఉన్న తన హక్కులను హరిస్తున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం […]

Advertisement
Update: 2016-03-15 04:40 GMT

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా వైసీపీ నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ... కోడెల శివప్రసాదరావుపై త్రీవ విమర్శలు చేశారు. కోడెల శివప్రసాదరావు పలు కేసుల్లో నిందితుడని ఆరోపించారు. కోడెలకు గతంలో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన మాట అవాస్తవమన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం కోడెలను విచారించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో బయటపడ్డారని చెప్పారు.

స్పీకర్‌గా అందరి హక్కులను కాపాడాల్సిన కోడెల శివప్రసాదరావు… ఎమ్మెల్యేగా ఉన్న తన హక్కులను హరిస్తున్నారని గోపిరెడ్డి ఆరోపించారు. సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడెల శివప్రసాదరావు… నర్సారావుపేటపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని వివరించారు. నర్సరావుపేటలో జరిగే ప్రతికార్యక్రమానికి కోడెల ప్రాతినిధ్యం వహించడం ఎంత వరకు సమంజసమని గోపిరెడ్డి చెప్పారు. ఇది నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న తన హక్కులను హరించడం కాదా? అని ప్రశ్నించారు.

స్పీకర్ కూర్చీ అడ్డుపెట్టుకుని ఆయన కొడుకు, కూతురు చేస్తున్న అక్రమాలు అందరికీ తెలుసని గోపిరెడ్డి ఆరోపించారు. తాను చెప్పింది నిజం కాకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని గోపిరెడ్డి సవాల్ విసిరారు. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. స్పీకర్‌గా ఉంటూ కూడా ఇతర పార్టీల నేతలకు పచ్చకండువా కప్పి టీడీపీలోకి కోడెల ఆహ్వానించడాన్ని ఏమనాలని నిలదీశారు. జొన్నలగడ్డ గ్రామంలో శిలాపలకం మీద కుమారుడి పేరు వేయించుకున్న ఘనత స్పీకర్‌ కోడెలకే దక్కుతుందన్నారు. ముప్పాళ్ల ఎంపీటీసీలను కిడ్నాప్ చేయించింది కోడెల శివప్రసాద్ కాదా? అని ప్రశ్నించారు. ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేసి ఎమ్మెల్యేపై దాడి చేస్తే కనీస విచారణ జరిపించలేదన్నారు. మాజీ సైనికులకు ఇచ్చిన భూమిలో అక్రమంగా సిమెంట్ రోడ్డు వేసేందుకు శంకుస్థాపన చేసింది స్వయంగా స్పీకరేనని గోపిరెడ్డి చెప్పారు. అది అక్రమం అన్నందుకు తనపై కోడెల శివప్రసాద్ నాన్‌ బెయిలబుల్ కేసులు పెట్టించారని ఆరోపించారు.

ఇలాంటి వ్యక్తి స్పీకర్‌గా ఉండవచ్చా అని గోపిరెడ్డి ప్రశ్నించారు. గోపిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రవణ్ తదితరులు దపదపాలుగా పదేపదే అడ్డుతగిలారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News