‘’ఆర్‌ యూ మ్యాడ్‌’’… చంద్రబాబు అసహనం

అమరావతిలో టీడీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేయడంపై వచ్చిన కథనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కథనాలు రాసిన విలేకర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘’ఆర్‌ యూ మ్యాడ్’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.  అగ్రిగోల్డ్‌ భూములను లోకేష్‌ తీసుకున్నారని  ఎలా రాస్తారని ప్రశ్నించారు.  కథనాలు రాసే వాడికి బుద్ధి ఉండాలి కదా అని  మండిపడ్డారు. ”ఆర్‌ యూ మ్యాడ్‌” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  సాక్షి కథనాల […]

Advertisement
Update: 2016-03-03 11:27 GMT

అమరావతిలో టీడీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేయడంపై వచ్చిన కథనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కథనాలు రాసిన విలేకర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘’ఆర్‌ యూ మ్యాడ్’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ భూములను లోకేష్‌ తీసుకున్నారని ఎలా రాస్తారని ప్రశ్నించారు. కథనాలు రాసే వాడికి బుద్ధి ఉండాలి కదా అని మండిపడ్డారు. ”ఆర్‌ యూ మ్యాడ్‌” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సాక్షి కథనాల వల్ల వ్యక్తులతో పాటు అమరావతికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ఎవడో భూములు కొనుక్కుంటే దానిపై ఏమని విచారణ జరపాలని ప్రశ్నించారు. వ్యాపారం చేసుకుంటే తప్పేంటని నిలదీశారు. తాను పాత పరిచయాలు ఉపయోగించి సింగపూర్ ను ఒప్పించి ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ వచ్చేలా కృషి చేశానన్నారు. సింగపూర్ ఎంతో నిజాయితీ కలిగిన దేశమని అన్నారు.

అసైన్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు వెంటనే మాట మార్చారు. అసైన్డ్‌ భూముల పరిహారం అసలు లబ్ధిదారులకే ఇస్తామన్న చంద్రబాబు … వెంటనే మాట మార్చారు. తనకు చాలా పనులు ఉన్నాయని ఈ అంశాన్ని మళ్లీ సమీక్షించి చెబుతా అంటూ మాట మార్చారు. రాజధాని భూములపై విచారణ అక్కర్లేదన్న చంద్రబాబు ఏం జరిగిందని సీబీఐ విచారణ జరపాలని ప్రశ్నించారు. ఇలాంటి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తామన్నారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News