అరె... నయనతార అరెస్టయిందా..?

నయనతార అరెస్ట్ అయిందట…. ఎయిర్ పోర్టులో ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారట… ఏకంగా ఒక రాత్రంతా ఆమెను పోలీసులు ప్రశ్నించారట… ఇలా స్టార్ హీరోయిన్ నయనతారపై ఊహించని విధంగా పుకార్లు చెలరేగాయి. ఆమెను పోలీసులు అడ్డుకున్న మాట నిజమే. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. ఓవర్ నైట్ ప్రశ్నించలేదు కూడా. పాస్ పోర్టులో తలెత్తిన చిన్న గందరగోళం కారణంగా నయనతార ఓ రాత్రంతా విమానాశ్రయంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఓ తమిళ షూటింగ్ కోసం మలేషియా వెళ్లిన నయనతార… తిరిగి […]

Advertisement
Update: 2016-02-06 05:43 GMT
నయనతార అరెస్ట్ అయిందట…. ఎయిర్ పోర్టులో ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారట… ఏకంగా ఒక రాత్రంతా ఆమెను పోలీసులు ప్రశ్నించారట… ఇలా స్టార్ హీరోయిన్ నయనతారపై ఊహించని విధంగా పుకార్లు చెలరేగాయి. ఆమెను పోలీసులు అడ్డుకున్న మాట నిజమే. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. ఓవర్ నైట్ ప్రశ్నించలేదు కూడా. పాస్ పోర్టులో తలెత్తిన చిన్న గందరగోళం కారణంగా నయనతార ఓ రాత్రంతా విమానాశ్రయంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఓ తమిళ షూటింగ్ కోసం మలేషియా వెళ్లిన నయనతార… తిరిగి ఇండియాకొచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లింది. అయితే విమానాశ్రయ అధికారులు మాత్రం నయన్ ను అడ్డుకున్నారు. డాక్యుమెంట్, పాస్ పోర్టులో పేరు వేరువేరుగా ఉండడాన్ని ప్రశ్నించారు. అది కేవలం స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రమే. కానీ దాన్నే అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. అలా ఒక రాత్రంతా విమానాశ్రయానికే పరిమితమైన నయనతార… తర్వాత మరో విమానంలో స్వదేశానికి తిరుగుప్రయాణమైంది.
Tags:    
Advertisement

Similar News