విశాల్ మరో రాజకీయ ఎత్తుగడ

నాన్‌లోకల్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తనను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ప్రయత్నించినా .. ఎదురొడ్డి నడిగర్ ఎన్నికల్లో విజయం సాధించిన విశాల్ ఇప్పుడో మరో ఎత్తుగడ వేస్తున్నారు. తెలుగువాడైన తనను మునుముందైనా కొందరు టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో అందుకు విరుగుడు మంత్రం ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. శరత్ కుమార్‌ ప్యానల్‌పై తన ప్యానల్‌ను గెలిపించుకున్న విశాల్ ఇప్పుడు తమిళనాట తిరుగులేని కథనాయకుల మనసు గెలిచే పనిలో ఉన్నారు. అందులో భాగంగా లెజెండ్ యాక్టర్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌పై దృష్టి పెట్టారు. […]

Advertisement
Update: 2015-10-24 01:09 GMT

నాన్‌లోకల్ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తనను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ప్రయత్నించినా .. ఎదురొడ్డి నడిగర్ ఎన్నికల్లో విజయం సాధించిన విశాల్ ఇప్పుడో మరో ఎత్తుగడ వేస్తున్నారు. తెలుగువాడైన తనను మునుముందైనా కొందరు టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో అందుకు విరుగుడు మంత్రం ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు.

శరత్ కుమార్‌ ప్యానల్‌పై తన ప్యానల్‌ను గెలిపించుకున్న విశాల్ ఇప్పుడు తమిళనాట తిరుగులేని కథనాయకుల మనసు గెలిచే పనిలో ఉన్నారు. అందులో భాగంగా లెజెండ్ యాక్టర్స్ రజనీకాంత్, కమల్ హాసన్‌పై దృష్టి పెట్టారు. వీరిద్దరికి నడిగర్ సంఘంలో గౌరవ సలహాదారులుగా చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గౌరవ సలహాదారులుగా ఉండి తమకు దిశానిర్దేశం చేయాల్సిందిగా వీరిద్దరిని విశాల్ బృందం కోరినట్టు సమాచారం.

25న జరిగే నూతన కార్యవర్గ సమావేశంలో కమలహాసన్, రజనీకాంత్‌లకు గౌరవ సలహాదారు పదవులు అందించే అంశంపై చర్చించనున్నారు. ఒకవేళ ఈ ప్రపోజల్‌కు రజనీ, కమల్ అంగీకరిస్తే విశాల్ ప్యానల్‌కు తిరుగుండదంటున్నారు. రజనీ, కమల్ గౌరవ సలహాదారులుగా ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే వాటిని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేరని అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు విశాల్‌ ఈ ఎత్తుగడ వేశారని భావిస్తున్నారు. చూడాలి గౌరవసలహాదారులుగా ఉండేందుకు రజనీకాంత్, కమల్ హాసన్ ఎంతవరకు ఓకే చెబుతారో?!

Tags:    
Advertisement

Similar News