ఆ మాటల ఆంతర్యమేమి పవన్

అమరావతి శంకుస్థాపనకు మంత్రులు ఆహ్వానించేందుకు వచ్చిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ సూటిగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై పవన్‌ అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం పలికేందుకు వచ్చినప్పుడు నెగిటివ్ టచ్‌తో ఎవరూ వ్యాఖ్యలు చేయరు. కానీ పవన్ మాత్రం అమరావతి మరో హైదరాబాద్‌ కాకూండా ఉండాలని పరోక్షంలో తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అభివృద్ధిని మొత్తం ఒకేచోట కేంద్రీకరించడం ద్వారా అమరావతిని […]

Advertisement
Update: 2015-10-17 22:06 GMT

అమరావతి శంకుస్థాపనకు మంత్రులు ఆహ్వానించేందుకు వచ్చిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ సూటిగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుపై పవన్‌ అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది.

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం పలికేందుకు వచ్చినప్పుడు నెగిటివ్ టచ్‌తో ఎవరూ వ్యాఖ్యలు చేయరు. కానీ పవన్ మాత్రం అమరావతి మరో హైదరాబాద్‌ కాకూండా ఉండాలని పరోక్షంలో తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అభివృద్ధిని మొత్తం ఒకేచోట కేంద్రీకరించడం ద్వారా అమరావతిని మరో హైదరబాద్‌లా మారుస్తున్నారన్న భావన పవన్ వ్యాఖ్యల్లో కనిపించింది.

ముఖ్యంగా రాజధాని శంకుస్తాపనకు హాజరుపై పవన్ దాటవేత దోరణిని ప్రదర్శించారు. శంకుస్థాపన రోజు తాను గుజరాత్‌లో షూటింగ్‌లో ఉంటానని చెప్పారు. ఆరోజు షూటింగ్‌ షెడ్యూల్ బట్టి శంకుస్థాపనకు హాజరుపై ఆలోచిస్తా అని సమాధానం ఇచ్చారు. అమరావతి శంకుస్థాపన అనేది మళ్లీమళ్లీ రాని ఓ మహా శుభకార్యమంటూ చంద్రబాబు చెబుతున్నా పవన్‌ మాత్రం చాలా సింపుల్‌గా స్పందించారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కన్నా తనకు సినిమా షూటింగే ముఖ్యమని పరోక్షంగా స్పష్టం చేశారు. షూటింగ్ షెడ్యూల్ అనుకూలిస్తే వస్తానని చెప్పడం ద్వారా రాజధాని శంకుస్థాపనకు ఇంత హడావుడి అవసరం లేదన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజధానికి శంకుస్థాపనకు జరుగుతున్న భారీ ఏర్పాట్లపైనా మాట్లాడబోయిన పవన్ మధ్యలో ఆ విషయాన్ని వదిలేశారు.

Tags:    
Advertisement

Similar News