కరణ్ ను అడుక్కుంటున్న సల్మాన్

భజరంగీ భాయ్ జాన్ తో తన కెరీర్ లో మరో తిరుగులేని విజయాన్నందుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో బజరంగీ కూడా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్నందుకున్న హీరో మరో దర్శకుడ్ని లేదా నిర్మాతకు బ్రతిమాలాల్సిన అవసరం లేదు. కానీ సల్మాన్ ఆ పని చేశాడు. మీడియా సాక్షిగా దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ను అడుక్కున్నాడు. తనకు ఆ సినిమాలో ఛాన్స్ ఇప్పించమని ప్రాధేమపడుతున్నాడు. మేటర్ లోకి వెళ్తే.. […]

Advertisement
Update: 2015-08-22 20:04 GMT
భజరంగీ భాయ్ జాన్ తో తన కెరీర్ లో మరో తిరుగులేని విజయాన్నందుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో బజరంగీ కూడా నిలిచింది. ఇంతటి ఘన విజయాన్నందుకున్న హీరో మరో దర్శకుడ్ని లేదా నిర్మాతకు బ్రతిమాలాల్సిన అవసరం లేదు. కానీ సల్మాన్ ఆ పని చేశాడు. మీడియా సాక్షిగా దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ను అడుక్కున్నాడు. తనకు ఆ సినిమాలో ఛాన్స్ ఇప్పించమని ప్రాధేమపడుతున్నాడు. మేటర్ లోకి వెళ్తే.. ఎప్పట్నుంచో శుద్ధి ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాడు కరణ్ జోహార్. ఈ సినిమాలో నటించాలని సల్మాన్ ను కోరాడు. కానీ అప్పట్లో సల్మాన్ తిరస్కరించాడు. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎంతోమంది హీరోల చేతులు మారింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ ప్రాజెక్ట్ తనకు ఇప్పించమని కరణ్ ను ఓపెన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాడు సల్మాన్. ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన బజరంగీ భాయ్ జాన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో.. సల్మాన్ కు ఇప్పుడు తనపై మరింత నమ్మకం పెరిగింది. శుద్ధి లాంటి ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించగలనని తెలుసుకున్నాడు. అందుకే గతంలో రిజెక్ట్ చేసిన ఆ సినిమాలో మళ్లీ నటిస్తానని కోరుకుంటున్నాడు.
Tags:    
Advertisement

Similar News