ఏపీలో బదిలీలకు 15 అర్ధరాత్రి వరకూ అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర సర్కారు ఈ నెల 15 వరకూ సడలించింది. అయితే కొన్ని విభాగాలకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం నాడు 98వ నెంబరుతో జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టు 15వ తేదీ అర్థరాత్రి వరకూ ఉద్యోగుల బదిలీలకు అవకాశముంది. ఆ తర్వాత యధావిధిగా బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ చీఫ్ సెక్రెటరీ పివి రమేష్ తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే […]

Advertisement
Update: 2015-08-05 00:48 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్ర సర్కారు ఈ నెల 15 వరకూ సడలించింది. అయితే కొన్ని విభాగాలకు దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం నాడు 98వ నెంబరుతో జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టు 15వ తేదీ అర్థరాత్రి వరకూ ఉద్యోగుల బదిలీలకు అవకాశముంది. ఆ తర్వాత యధావిధిగా బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ చీఫ్ సెక్రెటరీ పివి రమేష్ తెలిపారు. ఆదాయాన్ని ఆర్జించే రవాణా, వాణిజ్యపన్నులు, స్టాంపులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలు, సర్వీస్ విభాగాలైన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పాఠశాల, ఉన్నత విద్యా విభాగాలకు ఇది వర్తించదు. ఈ విభాగాలు తమ అవసరాల మేరకు బదిలీలు చేసుకువడానికిగాను ఉత్తర్వుల కోసం ఆర్థిక శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ట్రెజరీ అండ్ అకౌంట్స్, స్టేట్ ఆడిట్, సర్వే-సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తదితర డైరక్టరేట్ల ఉద్యోగులు, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులలో ఉన్నవారికి బదిలీలకు అవకాశం లేదు.
Tags:    
Advertisement

Similar News