పైరసీ చేస్తే యేడాదిపాటు థియేటర్‌పై నిషేధం: అరవింద్‌ హెచ్చరిక

రెండున్నరేళ్ల పాటు కష్టపడి తెలుగువారు గర్వపడేలా ‘బాహుబలి’ని నిర్మించారని, దయచేసి ఈ సినిమాను ఎవరూ పైరసీ చేయవద్దని అల్లు అరవింద్‌ విజ్ఞప్తి చేశారు. బాహుబలి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. సర్వీసు ప్రొవైడర్‌ నుంచి రక్షణ కోసం కోర్టు ఆర్డర్లు ఇచ్చిందని, బాహుబలి పైరసీ వస్తే… మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. దీన్ని పైరసీ చేసిన థియేటర్లపై ఏడాది నిషేధం తప్పదని అల్లుఅరవింద్‌ హెచ్చరించారు. కేవలం ఈ సినిమాను థియేటర్లలోనే ప్రేక్షకులు చూడాలని చిత్ర […]

Advertisement
Update: 2015-07-07 06:17 GMT

రెండున్నరేళ్ల పాటు కష్టపడి తెలుగువారు గర్వపడేలా ‘బాహుబలి’ని నిర్మించారని, దయచేసి ఈ సినిమాను ఎవరూ పైరసీ చేయవద్దని అల్లు అరవింద్‌ విజ్ఞప్తి చేశారు. బాహుబలి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. సర్వీసు ప్రొవైడర్‌ నుంచి రక్షణ కోసం కోర్టు ఆర్డర్లు ఇచ్చిందని, బాహుబలి పైరసీ వస్తే… మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌ చేయాలని కోరారు. దీన్ని పైరసీ చేసిన థియేటర్లపై ఏడాది నిషేధం తప్పదని అల్లుఅరవింద్‌ హెచ్చరించారు. కేవలం ఈ సినిమాను థియేటర్లలోనే ప్రేక్షకులు చూడాలని చిత్ర దర్శకుడు రాజమౌళి కోరారు. ఇది పెద్ద సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా బాహుబలి అని ఆయన అన్నారు. ఎవరు ఎక్కడ పైరసీ చేసినా… వెంటనే తెలిసిపోతుందన్నారు. పైరసీ జరుగకుండా థియేటర్‌ యజమానులు చర్య తీసుకోవాలని కోరారు. సెకండ్‌షో తర్వాత థియేటర్లలో పైరసీ జరుగుతోందని రాజమౌళి తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News