మహేష్ నిర్మాతగా పవన్ సినిమా

నమ్మడానికి కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నప్పటికీ త్వరలోనే ఈ కాంబినేషన్ నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పవన్-మహేష్ మంచి దోస్తులనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరికీ కామన్ ఫ్రెండ్ త్రివిక్రమ్. వీళ్ల ముగ్గురి మధ్య అండర్ స్టాండింగ్ బాగా ఉంది. అందుకే త్రివిక్రమ్ డైరక్షన్ లో త్వరలోనే పవన్ చేయబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి సిద్ధమౌతున్నాడు మహేష్. వీళ్ల ముగ్గురి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమా పేరు కోబలి.          […]

Advertisement
Update: 2015-05-31 21:43 GMT
నమ్మడానికి కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నప్పటికీ త్వరలోనే ఈ కాంబినేషన్ నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పవన్-మహేష్ మంచి దోస్తులనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక వీళ్లిద్దరికీ కామన్ ఫ్రెండ్ త్రివిక్రమ్. వీళ్ల ముగ్గురి మధ్య అండర్ స్టాండింగ్ బాగా ఉంది. అందుకే త్రివిక్రమ్ డైరక్షన్ లో త్వరలోనే పవన్ చేయబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి సిద్ధమౌతున్నాడు మహేష్. వీళ్ల ముగ్గురి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమా పేరు కోబలి.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కోబలి స్క్రిప్ట్ ను ఓ కొలిక్కి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. పవన్ కూడా టోటల్ స్క్రీన్ ప్లేకు ఓకే చెప్పాడు. దీంతో కోబలికి లైన్ క్లియర్ అయింది. అటు మహేష్ బాబు కూడా తనకు నచ్చితే సినిమా నిర్మించడానికి సిద్ధమని ప్రకటించాడు. ఇప్పటికే తన పేరుపై ఎమ్.బి అనే బ్యానర్ పెట్టాడు మహేష్. శ్రీమంతుడు సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆ అనుభవంతో పవన్-త్రివిక్రమ్ సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నాడట.
Tags:    
Advertisement

Similar News