అప్పుడు ఓటుకు నోటు.. ఇప్పుడు ఓటుకు ఒట్టు

స్పీకర్ ఫార్మాట్ లో ఇద్దరం రాజీనామా లేఖలను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇద్దామా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సవాల్ విసిరారు హరీష్ రావు.

Advertisement
Update: 2024-04-27 09:51 GMT

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య జరుగుతున్న రాజీనామా సవాళ్ల సిరీస్ లో ఇది తాజా ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. తన రాజీనామా సరిగా లేదని, ఒకటిన్నర పేజీ ఉందని, సీస పద్యం లాగా పొడవుగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు సెటైర్లు పేల్చడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసి ఆమోదించుకున్నది తామేనని.. నాడు రాజీనామాలంటే భయపడి కాంగ్రెస్, బీజేపీ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. రాజీనామాల గురించి వారు తమకి సుద్దులు చెప్పాలనుకోవద్దని హితవు పలికారు. రాజీనామాలు ఎలా చేయాలో తమకు తెలుసన్నారు.


కొత్త సవాల్..

స్పీకర్ ఫార్మాట్ లో ఇద్దరం రాజీనామా లేఖలను ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ఇద్దామా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త సవాల్ విసిరారు హరీష్ రావు. మీరు బాండ్ పేపర్ పై రాసిచ్చిన గ్యారెంటీలు, 2 లక్షల రూపాయల రుణమాఫీని... 100 రోజుల్లోగా అమలు చేస్తే తాను స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా లేఖ రాసి ఇచ్చేస్తానన్నారు హరీష్ రావు. తెలంగాణ కోసం రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను జిరాక్స్ తీసి బయటకు పంపించారని ఎద్దేవా చేశారు హరీష్.

ఓటుకి ఒట్టు..

నాడు ఓటుకు నోటు ఇస్తూ దొరికిన రేవంత్ రెడ్డి నేడు ఓటుకు ఒట్టు అంటున్నారని అన్నారు హరీష్ రావు. రేవంత్ దగ్గర సరుకు లేదని, వారు తనను తిడుతున్నారే తప్ప, సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లాలపై పడ్డారని, జిల్లాలు ఎక్కువ అయ్యాయని వాటిని తక్కువ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు హరీష్. 

Tags:    
Advertisement

Similar News