9న ఏది జరగాలో అది జరుగుతుంది.. రైతుబంధుపై రేవంత్

ఈసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి రైతుబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరు ఆపినా ఈనెల 9వ తేదీలోగా రైతుబంధు వేసి తీరుతా అని స్పష్టం చేశారు.

Advertisement
Update: 2024-05-08 09:22 GMT

లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణలో రైతుబంధు పంపిణీ నిలిపేయాలని ఎన్నికల క‌మిష‌న్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రైతు బంధు ఎలా అమలైందని.. పంపిణీ నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు అయిపోయాక నిధులు జమ చేయాలని ఆదేశించింది.


9లోగా రైతుబంధు వేసి తీరుతా..

ఈసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి రైతుబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరు ఆపినా ఈనెల 9వ తేదీలోగా రైతుబంధు వేసి తీరుతా అని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల రుణం తీర్చుకోడానికి రైతుబంధు రైతుల ఖాతాలో వేస్తా అంటే వెయ్యొద్దని ఎన్నికల సంఘం తనకు నోటీస్ ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఇది బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి పన్నిన కుట్ర అని ఆరోపించారు. అయినా ఏది జరగాలో అది జరిగి తీరుతుందని.. నగదు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరితుందన్నారు. కేసీఆర్‌ 9వ తేదీన అమరవీరుల స్థూపం దగ్గరికి రావాలని.. తాను మాట మీద నిలబడ్డానో లేదే అక్కడే తేల్చుకుందామని రేవంత్ మరోసారి సవాల్ విసిరారు. ఈసీ ఆదేశాలను కాదని రేవంత్ రెడ్డి రైతుబంధు జమ చేస్తారా?. లేదా ఎన్నికల స్టంటేనా అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

Tags:    
Advertisement

Similar News