రికార్డు వాన.. ఏడుగురి మృతి

హైదరాబాద్‌లో మూడు గంటలపాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Advertisement
Update: 2024-05-08 05:24 GMT

వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం తెలంగాణలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లో మూడు గంటలపాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపించాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

ఏడుగురు మృతి..

భారీ వర్షం, పెనుగాలుల ధాటికి బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ రిటర్నింగ్ వాల్ కూలి ఏడుగురు చనిపోయారు. ఇందులో ఆరుగురు కార్మికులతో పాటు నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

ఎక్కడెక్కడ ఎన్ని సెంటిమీటర్లు..!

అత్యధికంగా కూకట్‌పల్లిలో 12 సెం.మీల వర్షపాతం నమోదైంది. మియాపూర్, శేరిలింగంపల్లిలో 11సెం.మీ.. చందానగర్, బాచుపల్లి, లింగంపల్లిలో 10సెం.మీలు, గచ్చిబౌలి, యూసఫ్‌గూడలో 9 సెం.మీలు.. సికింద్రాబాద్‌లో 8 సెం.మీల వర్షం కురిసింది. నగరంలో చాలా ఏరియాల్లో 5 సెం.మీలపైనే వర్షపాతం నమోదైంది.

Tags:    
Advertisement

Similar News