టెస్లా తెలంగాణకు వచ్చేది.. కానీ - రేవంత్ సంచలన కామెంట్స్‌

బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే.. 43 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయ‌న్నారు.

Advertisement
Update: 2024-05-08 09:58 GMT

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన టెస్లాను.. మోడీ బలవంతంగా గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు కామెంట్స్ చేశారు రేవంత్. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులను గుజరాత్‌కు తరలిస్తున్నారన్నారు. ఫాక్స్‌కాన్‌ లాంటి దిగ్గజ సంస్థలపైనా ఒత్తిడి తెచ్చి మరీ గుజరాత్‌కు తీసుకెళ్లారన్నారు. తెలంగాణ ఇండియాలో లేదా అని ప్రశ్నించారు రేవంత్.


బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేయాలన్నారు సీఎం రేవంత్. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే.. 43 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయ‌న్నారు. బిహార్‌ నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తే తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్రం రూ. 7 ఇస్తుందన్నారు. యూపీకీ సైతం రూపాయికి తిరిగి ఆరు రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు రేవంత్. వాటితో సమానంగా తమకు కూడా న్యాయం జరగాలన్నారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో మోడీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు రేవంత్. మోడీ, అమిత్ షా దక్షిణాది ప్రజలను సెకండ్ గ్రేడ్‌ సిటీజన్స్‌గా చూస్తున్నారని ఆరోపించారు.

పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు రేవంత్. రెండు జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి మెజార్టీ స్థానాలు వస్తాయన్న ప్రచారంపైనా రేవంత్ స్పందించారు. కె.ఎ.పాల్‌ కూడా తానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్తారని, కానీ అది జరిగే విషయం కాదన్నారు.

Tags:    
Advertisement

Similar News