క్రిమినల్‌ రేవంత్.. మరోసారి కేటీఆర్‌ సవాల్‌

ఉస్మానియా చీఫ్ వాడెన్ లెటర్‌ను ఫోర్జరీ చేసిన క్రిమినల్‌ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మండిపడ్డారు. తప్పు చేసిన రేవంత్ రెడ్డి బయట తిరుగుతుంటే.. ఎలాంటి తప్పు చేయని క్రిషాంక్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడన్నారు.

Advertisement
Update: 2024-05-08 08:05 GMT

చంచల్‌గూడ జైలులో ఉన్న బీఆర్ఎస్‌ నేత క్రిషాంక్‌ను పరామర్శించారు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. "రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెడుదాం. ఏది ఒరిజినల్.. ఏది డూప్లికెట్ అనేది తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్ గూడ జైళ్లో కూర్చోవాలో కూడా తేలుద్దాం" అన్నారు కేటీఆర్.


తప్పు చేసిన రేవంత్ బయట..

ఉస్మానియా చీఫ్ వాడెన్ లెటర్‌ను ఫోర్జరీ చేసిన క్రిమినల్‌ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మండిపడ్డారు. తప్పు చేసిన రేవంత్ రెడ్డి బయట తిరుగుతుంటే.. ఎలాంటి తప్పు చేయని క్రిషాంక్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడన్నారు. దీన్నిబట్టే తెలంగాణలో ఎలాంటి వ్యవస్థ ఉందో అర్థం అవుతోందన్నారు కేటీఆర్. క్రిషాంక్ చాలా ధైర్యంగా ఉన్నాడని.. కేసులకు, జైలుకు భయపడేవాన్ని కాదని చెప్పాడన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి క్రిషాంక్‌ని విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి ఫేక్ సర్క్యులర్‌పై తన సవాల్‌ స్వీకరించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News