ఎక్స్ క్లూజివ్.. జీ తెలుగు చేతికి బంబిసార

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా బింబిసార. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ను జీ తెలుగు దక్కించుకుంది

Advertisement
Update: 2022-08-03 05:30 GMT

సరిగ్గా విడుదలకు కొన్ని రోజుల ముందు బింబిసార నాన్-థియేట్రికల్ క్లోజ్ అయింది. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన బింబిసార నాన్-థియేట్రికల్ హక్కుల్ని జీ తెలుగు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ (శాటిలైట్+డిజిటల్) 20 కోట్ల రూపాయలకు అమ్ముడిపోయినట్టు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ అంటే అది పెద్ద మొత్తమే. ఇంకా చెప్పాలంటే, ఈ హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ నాన్-థియేట్రికల్ బిజినెస్ ఇదే.

కొంతకాలంగా బాక్సాఫీస్ సక్సెస్ అందుకోలేకపోయాడు కల్యాణ్ రామ్. దీంతో అతడి థియేట్రికల్ మార్కెట్ తో పాటు, నాన్-థియేట్రికల్ మార్కెట్ కూడా పడిపోయింది. అయితే బింబిసార విషయానికొచ్చేసరికి మాత్రం ట్రయిలర్ తో ఈ సినిమా ఆకట్టుకుంది. అందుకే హీరో మార్కెట్ తో సంబంధం లేకుండా నాన్-థియేట్రికల్ మార్కెట్ జరిగింది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఈ సినిమా డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కల్యాణ్ రామ్. ఎప్పట్లానే తన సొంత బ్యానర్ పై సినిమాను నిర్మిస్తూ, హీరోగా నటించాడు ఈ నందమూరి హీరో. ఈ సినిమా రిజల్ట్ ఏంటనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది.

ఈ సినిమాలో బింబిసారుడి పాత్రలో నటించాడు కల్యాణ్ రామ్. ఓ దశలో నెగెటి షేడ్స్ లో కూడా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని తెలిపిన కల్యాణ్ రామ్, బింబిసారుడి పాత్ర తన కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుందని చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News