Harom Hara | కృష్ణ జయంతికి సుధీర్ బాబు సినిమా

Sudheer Babu's Harom Hara - సుధీర్ బాబు తాజా చిత్రం హరోంహర. ఈ సినిమా కృష్ణ జయంతి సందర్భంగా విడుదలకానుంది.

Advertisement
Update: 2024-04-28 08:13 GMT

సుధీర్‌బాబుకు తన మామగారు సూపర్‌స్టార్ కృష్ణ అంటే చాలా గౌరవం. కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాల కంటెంట్ ఏదైనా విడుదల చేస్తుంటారు. ఈసారి తన అప్ కమింగ్ మూవీ 'హరోం హర' చిత్రాన్ని కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు.

ఇది పర్ ఫెక్ట్ రిలీజ్ డేట్. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ రెండో వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల ముందే ఈ సినిమా ఆడియన్స్ ముందుకొస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది, అతని వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు. సుధీర్ బాబు ఫెరోషియస్ గా కనిపిస్తున్న పోస్టర్ బాగుంది.

ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

హరోం హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్‌లో డైలాగులు కూడా చెప్పాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. 

Tags:    
Advertisement

Similar News