Polimera 2 | మరో ఘనత దక్కించుకున్న పొలిమేర 2

Polimera 2 - సత్యం రాజేష్ నటించిన పొలిమేర-2 థియేటర్లలో హిట్టయింది. ఇప్పుడీ సినిమా మరో ఘనత దక్కించుకుంది.

Advertisement
Update: 2024-04-29 16:52 GMT

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ఫిలిం సిరీస్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మా ఊరి పొలిమేర. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2023 నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన మా ఊరి పొలిమేర 2 సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఈ సినిమాను ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడీ సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024లో మా ఊరి పొలిమేర 2 సినిమా అధికారికంగా ఎంపికైంది. రేపు ఢిల్లీలో ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమాను శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించడమే కాదు ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. సత్యం రాజేష్ కు ఇదొక డిఫరెంట్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

Tags:    
Advertisement

Similar News