Vakeel Saab Re-Release | పవన్ కల్యాణ్ సినిమా రీ-రిలీజ్

Vakeel Saab Re-Release Date: పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్. ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.

Advertisement
Update: 2024-04-29 16:37 GMT

Vakeel Saab Re-Release : టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు థియేటర్లలోకి మరోసారి వచ్చాయి. అయితే అలా వచ్చిన సినిమాల్లో మెరిసినవి కొన్ని మాత్రమే. ఇంకా చెప్పాలంటే సక్సెస్ రేటు ఒక శాతం కూడా లేదు. ఇప్పుడు మరో రీ-రిలీజ్ రెడీ అవుతోంది.


పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్, రీ-రిలీజ్ అవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ చేసిన సినిమా ఇది. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే సందర్భంగా మరోసారి థియేటర్లలోకి వస్తోంది. నివేత థామస్, అనన్య నాగళ్ల, అంజలి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో, పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.


బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. అయితే ఈ టైమ్ లో వకీల్ సాబ్ రీ-రిలీజ్ వద్దంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఓవైపు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడని, తామంతా పవన్ కల్యాణ్ వెంట ఉన్నామని, ఇలాంటి టైమ్ లో వకీల్ సాబ్ ను రీ-రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను డైవర్ట్ చేయొద్దని కోరుతున్నారు.


అయితే మేకర్స్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్యాప్ ను ఈ సినిమాతో భర్తీ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైంది.

Tags:    
Advertisement

Similar News