Sankarabharanam: మరో అరుదైన గౌరవం దక్కించుకున్న శంకరాభరణం

Sankarabharanam Movie: తెలుగుజాతి గర్వించదగ్గ అపురూప చిత్రం శంకరాభరణం. ఈ సినిమాకు ఇప్పుడు మరోసారి గుర్తింపు దక్కింది. గోవాలో జరగనున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.

Advertisement
Update: 2022-11-22 03:17 GMT

శంకరాభరణం.. కె.విశ్వనాధ్ సృష్టించిన ఈ అద్భుత కళాఖండానికి ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఈ సినిమాను ప్రపంచం గుర్తించింది. తెలుగు ఆణిముత్యాల్లో టాప్-5 సినిమాలు తీయమంటే, అందులో కచ్చితంగా ఉండే సినిమా శంకరాభరణం. ఇప్పుడీ సినిమాను మరోసారి గుర్తించింది ప్రభుత్వం.

గోవాలో జరిగే 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - 2022 లో "శంకరాభరణం" చిత్రాన్ని మరోసారి ప్రదర్శించబోతున్నారు. పునఃప్రతిష్టించుకోవాల్సిన ఇండియన్ క్లాసిక్స్ ( Restored Indian Classics) విభాగంలో ఈ సినిమా ఎంపికైంది.

నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సంస్థ, మన దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి , భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా శంకరాభరణాన్ని గుర్తుచేసుకుంది. కళాతపస్వి కె.విశ్వనాధ్, పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ఏడిద నాగేశ్వరరావు కలిసి సృష్టించిన ఈ అపురూప చిత్రాన్ని, ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.

గోవాలో జరిగే ఈ ప్రదర్సనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు. అలా శంకరాభరణం చిత్రాన్ని ఈతరం మరోసారి గుర్తుచేసుకోబోతోంది.

Tags:    
Advertisement

Similar News