Gangs Of Godavari | విశ్వక్ సేన్ సినిమా టీజర్ రిలీజ్

Gangs Of Godavari - విశ్వక్ సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Advertisement
Update: 2024-04-27 16:15 GMT

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో ఆయన "లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నాడు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" టీజర్ ఆకట్టుకుంటోంది. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా మేకోవర్ అయ్యే విశ్వక్ సేన్, "లంకల రత్న" పాత్ర కోసం తనని తాను మలుచుకున్న తీరు కట్టిపడేస్తోంది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరమీద కనిపిస్తోంది.

టీజర్‌లోని ప్రతి షాట్ "లంకల రత్న" పాత్ర తీరుని ప్రతిబింబించేలా ఉంది. టీజర్ లో ఆ పాత్ర గురించి, అక్కడి ప్రాంతం గురించి రాసిన సంభాషణలు.. ఈ చిత్రం చీకటి ప్రపంచాన్ని మనకు పరిచయం చేశాయి.

ఈ చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడటంపై విశ్వక్ సేన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా "అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్ది అంతే.", "నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు.. కానీ మంచోడిని అన్న చెడ్డ పేరొద్దు" వంటి సంభాషణలు విశ్వక్ సేన్ పోషించిన పాత్ర తీరుతో పాటు, యాసపై ఆయనకున్న పట్టుని తెలియచేస్తున్నాయి.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించగా.. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు.

Full View

Tags:    
Advertisement

Similar News