Thug Life | మరో హీరో ఎంట్రీ

Thug Life - కమల్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు శింబు. తాజాగా అతడి ఫస్ట్ లుక్ రిలీజైంది.

Advertisement
Update: 2024-05-08 17:42 GMT

విక్రమ్'తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'థగ్ లైఫ్'తో రాబోతున్నారు. ఈ భారీ చిత్రానికి మణిరత్నం దర్శకుడు. 1987లో వచ్చిన కమల్ హసన్, మణిరత్నం కల్ట్ ఫిల్మ్ 'నాయకన్' తర్వాత ఈ లెజండరీ ద్వయం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అద్భుతమైన తారాగణం, అగ్రశేణి సాంకేతిక నిపుణులతో థగ్ లైఫ్ హై బడ్జెట్ తో రూపొందుతోంది.

ఈ చిత్రంలో హీరో సిలంబరసన్ టిఆర్ (శింబు) కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ ప్యాక్డ్ టీజర్ షేర్ చేస్తూ శింబుని పరిచయం చేశారు మేకర్స్. టీజర్ లో శింబు కార్ లో దుమ్మురేపుతూ వచ్చి గన్ ని గురిపెట్టడం పవర్ ఫుల్ గా ఉంది.

కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్స్ పై ఆర్.మహేంద్రన్ శివ అనంతన్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ఎంటర్ టైనర్ కి ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అన్‌బరివ్‌ స్టంట్ కొరియోగ్రాఫర్స్.

Full View

Tags:    
Advertisement

Similar News