Rashmika | మరో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక

Rashmika - రష్మిక మరో బంపరాఫర్ కొట్టేసింది. బాలీవుడ్ లో సల్మాన్ సరసన నటించనుంది.

Advertisement
Update: 2024-05-09 17:27 GMT

స్టార్ హీరోయిన్ రశ్మిక వరుస అవకాశాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు తెలుగుతో పాటు హిందీలో భారీ ఆఫర్స్ దక్కుతున్నాయి. యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది రష్మిక.

ఆమె తాజాగా మరో బిగ్గెస్ట్ మూవీ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మేకర్స్ ఈ విషయాన్ని ఈ రోజు అనౌన్స్ చేశారు.

"సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా నటించేందుకు రశ్మిక కు అహ్వానం పలుకుతున్నాం. ఈ జంట ఆన్ స్క్రీన్ మ్యాజిక్ త్వరగా చూడాలని కోరుకుంటున్నాం. వచ్చే ఈద్ పండక్కి సల్మాన్, రష్మిక జంట తెరపైకి వస్తారు." అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ సినిమా తనకు దక్కడంపై రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. "నా నెక్ట్ మూవీ అప్డేట్ చెప్పమని ఫ్యాన్స్ తరుచూ అడుగుతుంటారు. సల్మాన్ సరసన సికిందర్ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా." అని పోస్ట్ చేసింది.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఆగస్టు 15న శ్రీవల్లిగా మరోసారి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. ఆమె గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News