RRR Movie: ఆర్ఆర్ఆర్ కు మరో 2 ప్రతిష్టాత్మక అవార్డులు

RRR Movie bags 2 critic choice awards గోల్డెన్ గ్లోబ్ లో సత్తా చాటిన RRR, ఇప్పుడు క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ కూడా అందుకుంది.

Advertisement
Update: 2023-01-16 07:24 GMT

అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తన సత్తా చాటుతోంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. ఇప్పుడీ సినిమా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ కు రెండు అవార్డులొచ్చాయి. 


అంతర్జాతీయ స్థాయిలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులకు మంచి గుర్తింపు ఉంది. ఎంతోమంది క్రిటిక్స్ మెప్పు పొందిన సినిమాలకు అవార్డులు ఇస్తుంటారు. ఈ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీలో అవార్డు అందుకుంది ఆర్ఆర్ఆర్. ఇక ఎప్పట్లానే నాటు నాటు సాంగ్ కు కూడా అవార్డ్ వచ్చింది. బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాకు అవార్డ్ వచ్చింది.


త్వరలోనే ఆస్కార్ బరిలో నిలవనుంది ఈ సినిమా. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు అందుకున్న ఈ సినిమా, ఆస్కార్ బరిలో హాట్ ఫేవరెట్ గా నిలిచింది. 


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన ఆర్ఆర్ఆర్, ప్రస్తుతం చైనాలో రికార్డ్ వసూళ్లు సాధిస్తోంది.

Tags:    
Advertisement

Similar News