Spy Movie - స్పైలో వివాదాల్లేవంటున్న నిఖిల్

SPY movie - స్పై మూవీలో ఎలాంటి వివాదాలు లేవంటున్నాడు హీరో నిఖిల్. అంతా కలిసి హ్యాపీగా థియేటర్లలో చూడదగ్గ ఫన్ మూవీ అని చెబుతున్నాడు.

Advertisement
Update: 2023-05-16 12:09 GMT

నిఖిల్ తాజా చిత్రం స్పై. సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అలా అని ఇది ఆయన బయోపిక్ కాదు. కేవలం కొన్ని కీలకమైన అంశాలను టచ్ చేస్తూ, దాని చుట్టూ అల్లుకున్న ఫిక్షన్ స్టోరీ ఇది. సాధారణంగా ఇలాంటి సినిమాలు వివాదాస్పదమౌతాయి. అయితే స్పై అలాంటి సినిమా కాదంటున్నాడు నిఖిల్.

"స్పై సినిమాలో సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పాం. కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్లు విడుదల చేసిందో, ఆ కాగితాల ఆధారంగానే సినిమాను తీశాం. అంతేతప్ప, మేం అదనంగా ఏం జోడించలేదు. ఇంకా చెప్పాలంటే, ప్రస్తుతం నేతాజీకి సంబంధించి నిజాలని భావిస్తున్న అంశాల్నే టచ్ చేశాం. మాకు తెలియని అంశాల జోలికి వెళ్లలేదు."

ఇలా స్పై సినిమా వివాదాలకు దూరంగా తెరకెక్కిందనే విషయాన్ని బయటపెట్టాడు నిఖిల్. నేతాజీ జీవిత చరిత్ర ఆధారంగా కల్యాణ్ రామ్ కూడా ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు డెవిల్. ఆ సినిమాకు తాము తీసిన స్పై సినిమాకు ఎలాంటి కనెక్షన్ లేదని కూడా నిఖిల్ వివరణ ఇచ్చాడు.

Tags:    
Advertisement

Similar News