Saindhav - వెంకీ సినిమాలో నవజుద్దీన్ సిద్దిఖి రోల్ ఇదే

Saindhav Movie - వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సినిమా సైంధవ్. ఈ సినిమా నుంచి విలన్ ఫస్ట్ లుక్ రిలీజైంది.

Advertisement
Update: 2023-05-20 11:36 GMT

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ 'సైంధవ్'. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది.

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. వికాస్ మాలిక్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ని పరిచయం చేశారు. ఒక ఖరీదైన కారుపై కూర్చుని బీడీ తాగుతూ కనిపించారు. గెటప్ లో క్లాస్‌ గా కనిపిస్తూనే సినిమాలో డెడ్లీ విలన్‌ గా నటిస్తున్నారు.

మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది సైంధవ్ మూవీ.




Tags:    
Advertisement

Similar News