Custody - కస్టడీ మొదటి రోజు వసూళ్లు

Custody Collection - నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. మొదటి రోజు ఈ సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. డే-వన్ వసూళ్లు చూద్దాం

Advertisement
Update: 2023-05-13 07:58 GMT

నాగచైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. కృతి శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు డైరక్ట్ చేసిన ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, చైతూ కెరీర్ లో మంచి ఓపెనర్ గా నిలిచింది కస్టడీ మూవీ. తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను అధికారికంగా విడుదల చేశారు మేకర్స్.

కస్టడీ మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ లెక్కల్లో చూసుకుంటే, 3 కోట్ల 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది కస్టడీ మూవీ.

బంగార్రాజు, వెంకీమామ సినిమాలు నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్స్. అయితే ఆ రెండూ మల్టీస్టారర్ సినిమాలే. సోలోగా చూసుకుంటే మాత్రం నాగచైతన్య టాప్-3 మూవీస్ లో కస్టడీ ఒకటిగా నిలుస్తుంది.

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే అనుమానాలు అందర్లో ఉన్నాయి. ఈ సినిమాను వరల్డ్ వైడ్ 24 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అటుఇటుగా 20 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. 




Tags:    
Advertisement

Similar News