Mahesh Babu's Guntur Kaaram Movie: నోట్లో బీడీ.. మహేష్ బాబు ఊర మాస్

Mahesh Babu's Guntur Kaaram Movie: మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ పెట్టారు.

Advertisement
Update: 2023-05-31 13:32 GMT

గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. తాజా చిత్రంలో మహేష్ బాబు ను, త్రివిక్రమ్ ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడనే ఆసక్తి అందర్లో ఉంది. ఇప్పుడా సస్పెన్స్ వీడింది. మహేష్ బాబు ను ఊరమాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా టైటిల్ తో పాటు, మాస్ స్ట్రయిక్ అంటూ గ్లింప్స్ ను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొద్దిరోజులుగా మీడియాలో నలుగుతున్న టైటిలే ఇది. ఇప్పుడు అధికారికంగా ఎనౌన్స్ చేశారు. కాబట్టి ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎటొచ్చి, టైటిల్ తో పాటు విడుదల చేసిన వీడియో మాత్రం అదిరింది.

మహేష్ ను ఫుల్ లెంగ్త్ యాక్షన్-మాస్ లుక్ లో చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. మరీ ముఖ్యంగా నోట్లోంచి బీడీని బయటకు తీసి వెలిగించడం టోటల్ వీడియోకే హైలెట్. తలకు ఎర్ర కండువా కట్టుకొని, మహేష్ నడిచొస్తున్న విజువల్ ఎట్రాక్ట్ చేస్తోంది. వీడియోకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

ఈమధ్య వచ్చిన ప్రతి సినిమాలో క్లాస్ గానే కనిపించాడు మహేష్. వాటికి పూర్తి భిన్నమైన లుక్, మేనరిజమ్ ఈ గుంటూరు కారంలో కనిపిస్తోంది. గ్లింప్స్ విడుదల సందర్భంగా రిలీజ్ డేట్ పై కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనవరి 13న థియేటర్లలోకి రానుంది గుంటూరు కారం. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. 


Full View


Tags:    
Advertisement

Similar News