Mahesh Babu - మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేష్

Mahesh Babu is on a foreign vacation with his family - కుటుంబంతో కలిసి మరోసారి విదేశాల బాటపట్టాడు మహేష్. ఈసారి 2 వారాలు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు.

Advertisement
Update: 2023-04-06 06:51 GMT

సరిగ్గా 4 నెలల కిందట విదేశీ పర్యటనకు వెళ్లాడు మహేష్. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. సంక్రాంతి టైమ్ కు హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇప్పుడు మరోసారి విదేశాలకు వెళ్లాడు ఈ హీరో. ఎప్పట్లానే ఈసారి కూడా 2 వారాలు గ్యాప్ తీసుకున్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ ఇంటి సెట్ వేశారు. ఆ సెట్ లోనే మొన్నటివరకు షూట్ జరిగింది. మహేష్, పూజాహెగ్డేపై కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా తీశారు. తదుపరి షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ గ్యాప్ లో కుటుంబంతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేశాడు మహేష్ బాబు. అందరూ కలిసి శంషాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ఏ దేశం వెళ్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒక రోజు గడిస్తే, ఎలాగూ నమ్రత, ట్విట్టర్ లో ఆ ఫొటోలు షేర్ చేస్తుంది.

హారిక-హాసిని బ్యానర్ పై తెరకెక్కుతోంది మహేష్-త్రివిక్రమ్ మూవీ. ఈమధ్యనే ఈ సినిమా నుంచి మహేష్ మాస్ లుక్ ను విడుదల చేశారు. ఇక వచ్చే నెల కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News