కృష్ణమ్మ టీజర్.. మరో గెటప్ లో సత్యదేవ్

సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కృష్ణమ్మ. ఈ సినిమా టీజర్ రిలీజైంది. సాయితేజ్ చేతుల మీదుగా విడుదలైన టీజర్ ఎలా ఉందో చూద్దాం..

Advertisement
Update: 2022-08-04 11:53 GMT

రీసెంట్‌గా గాడ్సే చిత్రంతో థియేటర్లలోకి వచ్చాడు సత్యదేవ్. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ 'కృష్ణమ్మ'. రీసెంట్‌గా ఆ సినిమా నుంచి రిలీజైన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఇం‌టెన్స్ లుక్‌ లో కనిపించాడు. ఇప్పుడా లుక్ కు కొనసాగింపుగా కృష్ణమ్మ టీజర్ రిలీజ్ చేశారు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైన కృష్ణమ్మ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

కృష్ణమ్మ టీజ‌ర్ నిమిషం 19 సెకన్లు ఉంది. ఇందులో సత్యదావ్ పాత్రతో పాటు, మిగతా కీలక పాత్రల్ని కూడా పరిచయం చేశారు. టీజ‌ర్‌లో స‌త్య‌దేవ్ వాయిస్ ఓవ‌ర్‌తో క‌థ‌ను వివ‌రించారు. త‌న వాయిస్ తెలియ‌ని ఓ భ‌యాన్ని క్రియేట్ చేస్తోంది. 'ఈ కృష్ణ‌మ్మ‌లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్క‌డ పుట్టామో ఎవ‌రికీ తెలియ‌దు' అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో టైటిల్ పెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని టీజ‌ర్‌లో చూపించారు.

ఓ చిన్న ప‌ట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విల‌న్‌కి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే కృష్ణ‌మ్మ సినిమా అనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది. ఓ చిన్న ఘ‌ట‌న వారి ముగ్గురి జీవితాల‌ను ఎలా మ‌లుపు తిప్పింద‌నేదే ఈ సినిమా. కాలభైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్‌, టీజ‌ర్‌లో చూపించిన స‌త్య‌దేవ్ ఆవేశం సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచాయి.

టీజర్ చూస్తుంటే ఇదొక యాక్ష‌న్ డ్రామా అని తెలుస్తోంది. స్టార్ డైరక్టర్ కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి.. ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ నెలాఖరుకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.


Full View

Tags:    
Advertisement

Similar News