Nenu Student Sir: ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే!

Nenu Student Sir: బెల్లంకొండ గణేష్ హీరో గా నటించిన ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదల అయింది.

Advertisement
Update: 2022-12-12 14:19 GMT

'స్వాతిముత్యం' సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!' తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌ లో 'నాంది' సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. 


ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్. తాజాగా వచ్చిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సాంగ్స్ తో హల్ చల్ చేస్తోంది ఈ సినిమా.  


డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశాడు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్‌ ఈ పాటని ఆలపించారు. 


కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్‌ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. గణేష్, అవంతిక ఇద్దరూ కూల్ గా కనిపిస్తున్నారు.


ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథ అందించాడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందించాడు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు.


Full View


Tags:    
Advertisement

Similar News