Dasara Movie - నాని సినిమాపై 'మెగా' ప్రశంశలు

Chiranjeevi appreciates Dasara movie - దసరా సినిమాను మెచ్చుకున్నారు చిరంజీవి. నానితో పాటు టోటల్ టీమ్ కు శుభాకాంక్షలు అందించారు.

Advertisement
Update: 2023-04-13 12:53 GMT

దసరా సినిమాతో హిట్ కొట్టాడు నాని. ఆంధ్రా, సీడెడ్ లో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రానప్పటికీ ఓవరాల్ గా సినిమా సక్సెస్ అయింది. మహేష్, ప్రభాస్ లాంటి స్టార్స్ సైతం ఈ సినిమాను మెచ్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. నానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

"కంగ్రాట్యులేషన్స్ నాని, దసరా సినిమా చూశాను. బ్రిలియంట్ మూవీ. నీ మేకోవర్, పెర్ఫార్మెన్స్ తో చంపేశావ్. ఓదెల శ్రీకాంత్ మొదటి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. అతడి మేకింగ్ చాలా బాగుంది. కీర్తిసురేష్ వావ్ అనిపించింది. దీక్షిత్ శెట్టి నటన, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అదిరిపోయాయి. దసరా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు."

ఇలా దసరా ను మెచ్చుకున్న సెలబ్రిటీల లిస్ట్ లోకి చిరంజీవి కూడా చేరిపోయారు. చిరంజీవి ట్వీట్ పెట్టిన వెంటనే నాని, శ్రీకాంత్ ఓదెల రెస్పాండ్ అయ్యారు. చిరంజీవికి నాని థ్యాంక్స్ చెప్పాడు. తెరపైనే కాదు, నిజజీవితంలో కూడా ఎప్పటికీ మీరు మెగాస్టార్ అని పొగిడాడు.

ఇక చిరంజీవి ట్వీట్ కు శ్రీకాంత్ ఓదెల కూడా రెస్పాండ్ అయ్యాడు. తను చిన్నప్పుడు వేసిన వీణ స్టెప్ ఫొటోను షేర్ చేసి, చిరంజీవికి ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం తను ఎగిరి గంతేస్తున్నట్టు ట్వీట్ పెట్టాడు.

Tags:    
Advertisement

Similar News