బండ్లన్న మళ్లీ భజన మొదలెట్టాడయ్యా..

బండ్ల గణేష్.. ఈ పేరు వింటే చాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. స్టేజ్ పై పవన్ ని అర వీర భయంకరంగా పొగిడేస్తుంటాడు బండ్లన్న.

Advertisement
Update: 2022-10-01 04:25 GMT

బండ్ల గణేష్.. ఈ పేరు వింటే చాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. స్టేజ్ పై పవన్ ని అర వీర భయంకరంగా పొగిడేస్తుంటాడు బండ్లన్న. సినీ ఇండస్ట్రీలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వచ్చే ప్రేక్షకులు పవన్ గురించి మాట్లాడాలని కేకలు వేయడానికి ఒక రకంగా కారణం అని చెప్పుకునే వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరని చెప్పొచ్చు. పవన్ నా దేవర అని, పవన్ కళ్యాణ్ కి భక్తులు తప్ప ఫ్యాన్స్ ఉండరని సెలవిచ్చిన బండ్లన్న ఓ రకంగా పవన్ ని ఆకాశానికి ఎత్తుతుంటే ఆనందపడటం ఫ్యాన్స్ కి అలవాటు చేశాడు.

అందుకే వారు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పవన్ గురించి మాట్లాడాలని కేకలు పెడుతుంటారు. పవన్ నా దేవుడని చెప్పుకునే గణేష్ జనసేనలో మాత్రం చేరలేదు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో చేరాడు. అయితే పోటీ చేసేందుకు టికెట్ కూడా దక్కక పోవడంతో ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఆయనతో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేశాడు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ చేయడంలో గణేష్ దిట్ట అనే పేరు ఉంది. చాలా వరకు దర్శకులను, హీరోలను పొగుడుతూ వారి డేట్స్ పట్టేస్తుంటాడు. చాలా రోజులుగా బండ్ల గణేష్ మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని తపిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా పలుసార్లు తన కోరికను కూడా బయటపెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బండ్ల గణేష్ ను కరుణించడం లేదు.

అయినా సరే బండ్ల గణేష్ తగ్గడం లేదు. పవన్ భజన కొనసాగిస్తూనే ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఆయన నామస్మరణ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనగా అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఒక పిక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్ 'అబ్బబ్బ మా బాస్ ని చూస్తుంటే గుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఒక్క ఛాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్' అని ట్వీట్ చేశాడు. బండ్లన్న చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Tags:    
Advertisement

Similar News