శ్రీవిష్ణు నుంచి మరో సినిమా రెడీ

శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త సినిమా అల్లూరి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2022-08-14 04:29 GMT

హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఓ పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ 'అల్లూరి' లో నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక.

చిత్రబృందం తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రెండో వారం నుంచి దసరా సెలవులు ఈ చిత్రానికి కలసిరానున్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు చేతిలో ఈటె పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించాడు.

అల్లూరి అదిరిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజరాజ చోర సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు.. అల్లూరిపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.




 


Tags:    
Advertisement

Similar News