షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టులు.. చంద్రబాబూ.. అతను మీవాడే..

తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిందితుడు ఉదయ్‌ భార్య విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చేసింది. దీన్నిబట్టి నిందితుడికి టీడీపీతో ఉన్న అనుబంధం తెలిసిపోతోంది.

Advertisement
Update: 2024-02-15 08:02 GMT

వైసీపీ కార్యకర్తలు చేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా పచ్చబ్యాచ్‌ తెగ బాధపడిపోయింది. ఎల్లో మీడియా పచ్చ బ్యాచ్‌కు వంత పాడింది. ఆ పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడంతో అసలు విష‌యం బయటిపడింది. పోస్టులు పెట్టిన వ్యక్తి టీడీపీ వీరాభిమాని అని తేలింది. జగన్‌ మీద కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని తేలింది.

షర్మిల, సునీతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించి, జగన్‌ను చిక్కుల్లో పడేయాలని కుట్ర చేసినట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. విశాఖకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ్‌ భూషణ్‌ ఫేస్‌బుక్‌లో జుగుప్సాకరంగా షర్మిల, నర్రెడ్డి సునీతలపై పోస్టింగుల పెడుతున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఐపీ అడ్రస్‌ అధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.

తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిందితుడు ఉదయ్‌ భార్య విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చేసింది. దీన్నిబట్టి నిందితుడికి టీడీపీతో ఉన్న అనుబంధం తెలిసిపోతోంది.

విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న పినపాల ఉదయ్‌ ఈ ఏడాది జనవరి 13వ తేదీన పులివెందులకు చెందిన వర్రా రవీందర్‌ రెడ్డి పేరుతో ఫేస్‌ బుక్‌లో నకిలీ ఖాతా తెరిచాడు. వైసీపీ సోషల్‌ మీడియా సభ్యుడు రవీంద్రారెడ్డి ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టాడు. ఆ ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి షర్మిల, సునీతలపై అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతూ వస్తున్నాడు. రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 3వ తేదీన కేసు నమోదైంది.

ఫేస్‌బుక్‌ డేటా బేస్‌ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌ను ట్రాక్‌ చేసిన విశాఖకు చెందిన పినపాల ఉదయ్‌ భూషణ్‌గా పోలీసులు గుర్తించారు. టీడీపికి వీరాభిమాని అయిన ఉదయ్‌ పార్టీ తరఫున పలు వాట్సప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా గ్రూపుల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అతన్ని ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్‌ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇతర కుట్రదారులను కూడా గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News