పవన్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌.. ఏమన్నాడంటే..!

పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్నానన్నారు. పవన్‌ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Advertisement
Update: 2024-05-09 14:07 GMT

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మరో మెగా హీరో మద్దతు తెలిపారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ పవన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో అల్లు అర్జున్‌ సైతం పవన్‌కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

బన్నీ ఏమన్నారంటే..?

పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్నానన్నారు. పవన్‌ ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయని పవన్‌కు మద్దతు తెలిపారు. పవన్‌ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు బన్నీ.


ఇక ఇటీవల హీరో నాని సైతం జనసేనానికి మద్దతు తెలిపారు. చిరంజీవి పిఠాపురంలో ప్రచారానికి వస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు తన తమ్ముడికి మద్దతు తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక వీరితో పాటు జబర్దస్త్ నటులు, ఆది, గెటప్ శ్రీను లాంటి వాళ్లు పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చూడాలి.. మరీ పవన్‌ ఈ సారైనా అసెంబ్లీలో అడుగుపెడతారో..లేదో..!

Tags:    
Advertisement

Similar News