పోలింగ్ తర్వాతే లబ్ధిదారులకు పథకాల సొమ్ము..

కోర్టు ఉత్తర్వులతో ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని తేలింది.

Advertisement
Update: 2024-05-09 08:36 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ లబ్ధిదారులకు పథకాల సొమ్ము చివరి విడత జమకాలేదు. దీనికి కారణం టీడీపీయేనని తేలింది. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి మరీ లబ్ధిదారులకు ఆర్థిక సాయం జమకాకుండా ఆపివేయించారు టీడీపీ నేతలు. దీంతో లబ్ధిదారుల్లో కొందరు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికిప్పుడు నిధులు జమచేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఎన్నికల తర్వాత ఆ నిధులు వేయాలని, దానికోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపింది.

ఎన్నికల కోడ్ మొదలు కాకముందే సీఎం జగన్ ఆయా పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు. రూ.14,165 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని ఆయన విడుదల చేశారు. అయితే కొందరికి మాత్రం నిధులు జమ కాలేదు. ఆలోగా కోడ్ రావడంతో అధికారులు ఎన్నికల కమిషన్ ని ప్రత్యేక అనుమతి కోరారు. కోడ్ మొదలైందని, ఇప్పుడు ఆర్థిక సాయం బ్యాంకుల్లో జమచేయడం కుదరదని ఈసీ చెప్పింది. దీంతో కొందరు లబ్ధిదారులు కోర్టుని ఆశ్రయించారు.

జగన్ నిధులు విడుదల చేసిన పథకాలు కొత్తవేమీ కావని, గత బడ్జెట్ లోనే వాటికి నిధులు కేటాయించామని అధికారులు ఈసీకి చెప్పినా ఫలితం లేకపోవడంతో చివరకు వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. కోర్టు కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి ఆర్థిక సాయం వద్దని చెప్పింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో ఆ సొమ్ము జమ అయ్యేలా ప్రణాళిక రూపొందించాలని ఉత్తర్వులిచ్చింది. కోర్టు ఉత్తర్వులతో ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Tags:    
Advertisement

Similar News