చంద్రబాబుకి రింగులో చిప్ ఉంది, చినబాబుకి బుర్రలో చిప్ లేదు..

ముఖ్యమంత్రుల పనితీరుపై జరిగిన సర్వేలో ఏపీ సీఎం జగన్ వెనకపడ్డారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోజా

Advertisement
Update: 2022-07-14 09:07 GMT

చంద్రబాబుకి రింగులో చిప్ ఉందని, కానీ అది ఉండాల్సింది బుర్రలో అని బాబు గుర్తు చేసుకోవాలన్నారు మంత్రి రోజా. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరిపై సెటైర్లు వేశారు. అసలు లోకేష్ కి చిన్నప్పటినుంచీ చిప్ లేదని విమర్శించారు. చంద్రబాబుకి చిన్నమెదడు చితికిపోయిందని అన్నారు. ఓవైపు కాంగ్రెస్‌ కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నారని, టీడీపీ ఏ గట్టునుందో ఎవరికీ తెలియదన్నారు.

బోగస్ బాబు, బోగస్ సర్వేలు..

ముఖ్యమంత్రుల పనితీరుపై జరిగిన సర్వేలో ఏపీ సీఎం జగన్ వెనకపడ్డారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోజా. 10 రోజుల ముందు మహారాష్ట్రకు సీఎం అయిన షిండేకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అందిస్తోన్న ఏపీ సీఎం జగన్‌ కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అసలా సర్వే చంద్రబాబు చేయించిందేనని, ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయించే ఆయన్ను ప్రజలంతా బోగస్ బాబు అంటుంటారని చెప్పారు రోజా. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదన్నారు. అలాగే సర్వేల్లో జగన్ ర్యాంకు తగ్గే అవకాశమే లేదన్నారు. మూడు సంవత్సరాలుగా ఏపీలో సుపరిపాలన చేస్తూ, జగన్ అందరు ముఖ్యమంత్రులకంటే ముందున్నారని, మొదటి స్థానం ఆయనదేనని చెప్పారు రోజా.

కొడాలి చెప్పింది చేయాల్సిందే..

రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయారని విమర్శించారు రోజా. ఇటీవల ప్లీనరీలో మాజీ మంత్రి కొడాలి నాని, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఆమె గుర్తు చేశారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుని మానసిక వైకల్యం కేంద్రంలో చేర్చుతామని కొడాలి నాని చెప్పారని, అది కచ్చితంగా జరిగి తీరుతుందని, వీలైతే అంతకు ముందే బాబుని ఆ కేంద్రంలో చేర్చాల్సిన అవసరం వస్తుందని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News