ముస్లిం సమాజం మిమ్మల్నెలా నమ్మాలి? - బాబు తీరుపై ముస్లిం జేఏసీ అధ్యక్షుడు ధ్వజం

దేశ ప్రధాని మోడీ, అమిత్‌ షా, పీయూష్‌ గోయల్‌ ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని బహిరంగంగా ప్రకటించారని మహమ్మద్‌ కలీం గుర్తు చేశారు.

Advertisement
Update: 2024-04-29 08:42 GMT

ముస్లిం సమాజం మిమ్మల్నెలా నమ్మాలి చంద్ర‌బాబూ అంటూ ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్, ముస్లిం జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్‌ కలీం ధ్వజమెత్తారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ నాయకత్వం బహిరంగంగా ప్రకటనలు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ జాతీయ నాయకత్వం బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం అదేం లేదంటూ ముస్లిం సామాజిక వర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై మిమ్మల్నెలా నమ్మాలి బాబూ అంటూ ప్రశ్నించారు.

దేశ ప్రధాని మోడీ, అమిత్‌ షా, పీయూష్‌ గోయల్‌ ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని బహిరంగంగా ప్రకటించారని మహమ్మద్‌ కలీం గుర్తు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం.. సామాజిక మాధ్యమాల ద్వారా రిజర్వేషన్లపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతోందని చెప్పారు. ఒక పార్టీ ఆనుకూలమంటూ.. మరో పార్టీ వ్యతిరేకమంటూ.. ఇంకో పార్టీ మౌనం వహిస్తూ.. మూడు పార్టీలు మూడు విధాలుగా ఉంటే ముస్లిం సమాజం మిమ్మల్ని ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఆగ్ర నాయకులు ముస్లిం రిజర్వేషన్లపై ఉమ్మడి మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించాలని మహమ్మద్‌ కలీం ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News