ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రగడ.. అసలు నిజమేంటంటే..?

ప్రజలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన సీఎం జగన్, వారి స్థలాలను లాగేసుకుంటారా..? చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించిన జగన్.. రైతుల భూముల్ని లాగేసుకుంటారా అని ప్రశ్నించారు మంత్రి ధర్మాన.

Advertisement
Update: 2024-04-29 08:58 GMT

ఏపీలో ఎన్నికల వేల టీడీపీ కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు. అసత్య వార్తలు, అభూతకల్పనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీపై నిందలు వేస్తున్నారు. టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో చెత్త విశ్లేషణలు ఎక్కువయ్యాయి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల భూముల్ని కాజేస్తారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజలు నష్టపోతారని గొడవ మొదలు పెట్టారు.

అసలేంటి సంగతి..?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంకా ఏపీలో అమలులోకి రాలేదు, అసలు దాన్ని అమలు చేయబోమని కూడా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. గతంలో ఇదే విషయం చెప్పామని, మరోసారి దీనిపై స్పందించాల్సి వస్తోందని చెప్పారాయన. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలనేది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయం అని వివరించారాయన. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తూనే ఉందని, అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టిందని, అయినా కూడా టీడీపీ తమపై బురదజల్లాలని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఏకాభిప్రాయం వస్తే దీని గురించి ఆలోచిస్తామని చెప్పారు ధర్మాన.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా రైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసిందని చెప్పారు మంత్రి ధర్మాన. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు జరుగుతుందని, అత్యాధునిక టెక్నాలజీని సర్వేకోసం వినియోగించామని దీనివల్ల రికార్డులు అప్ టు డేట్ గా ఉంటాయన్నారు. పరిపాలన వికేంద్రకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయని, మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుందన్నారు. ఆటోమేటిక్ గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. ఇంత చేస్తుంటే.. ఇంకా వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ధర్మాన.

ప్రజలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన సీఎం జగన్, వారి స్థలాలను లాగేసుకుంటారా..? అని ప్రశ్నించారు మంత్రి ధర్మాన. చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించిన జగన్.. రైతుల భూముల్ని లాగేసుకుంటారా అని అడిగారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు ధర్మాన. 

Tags:    
Advertisement

Similar News