పవన్..బాబు గురించి ఇది తెలుసుకో

టీడీపీ - జనసేన పొత్తు గురించి, చంద్రబాబు గురించి మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update: 2024-01-26 08:33 GMT

ముఖ్యమంత్రి జగన్ ను ఓడించాలన్న లక్ష్యంతో ఒక్కటయ్యారు చంద్రబాబు, పవన్. అయితే పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. 2014లో టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. అయినా తమ గెలుపులో పవన్ పాత్ర ఏమీ లేదని, తమ శక్తివల్లే గెలిచామని అప్పట్లో టీడీపీ నాయకులు కామెంట్లు చేశారు. అవన్నీ పవన్ కి గుర్తున్నాయో లేదో కానీ మళ్లీ టీడీపీతోనే జతకట్టారు.

పదేళ్ల కిందట ఎన్నికల్లో పోటీ చేయకుండా పవన్ టీడీపీకి మద్దతు ఇస్తే ఈసారి మాత్రం కనీసం 50 నుంచి 60 సీట్లు పొత్తులో భాగంగా ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సీట్ల పంపకం గురించి ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారు. సంక్రాంతి కల్లా సీట్ల సంఖ్య తేల్చుతా.. అని ఒకసారి, బీజేపీ కలసి వస్తుందేమో వేచి చూద్దామని మరోసారి, ఇలా జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య తేల్చకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు.

కానీ, చంద్రబాబు తన పని మాత్రం తాను చేసుకుంటూ పోతున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గతంలో ప్రజారాజ్యం తరపున గెలిచిన ఆళ్లగడ్డ, తిరుపతి స్థానాలు ఇవ్వాలని కోరుతుండగా చంద్రబాబు మాత్రం ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఫోన్ కాల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. జనసేనకు ఇచ్చే సీట్లు 15 నుంచి 20 లోపే అని మరొకవైపు ఎల్లో మీడియా ద్వారా లీకులు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ - జనసేన పొత్తు గురించి, చంద్రబాబు గురించి మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మం పాటించని వాడే చంద్రబాబు.. ఈ విషయాన్ని తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్..' అంటూ అంబటి సూచించారు. అంబటి చేసిన కామెంట్ లో వాస్తవం ఉందని పవన్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News