సీఎం జగన్, మంత్రులకు ఏపీ హైకోర్టు నోటీసులు

ఈ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు.

Advertisement
Update: 2023-11-23 07:54 GMT

కోర్టులను అడ్డు పెట్టుకుని ఏపీలో పొలిటికల్ రివేంజ్ గేమ్ లు మొదలయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారాలు మరింత పెరిగాయి. జగన్ పాత కేసుల్లో తక్షణం విచారణ జరిపించాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆయన దాఖలు చేసిన మరో పిటిషన్ లో ఏపీ హైకోర్టు.. సీఎం జగన్ సహా మంత్రులు, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం 41మందికి నోటీసులిచ్చింది. ఈ నోటీసుల వల్ల ప్రయోజనం ఏంటి..? అసలు జగన్ చేసిన తప్పేంటి..? ఆ కేసు నిలబడుతుందా అనే విషయం పక్కనపెడితే నోటీసుల వ్యవహారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తావిచ్చింది.

అసలేం జరిగింది..?

ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అడ్డు పెట్టుకుని నేతలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని కూడా ఆయన తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. ప్రతివాదుల్లో సీఎం జగన్, కొందరు మంత్రులు, అధికారులు ఉన్నారు.

ప్రజా ప్రయోజనం ఉందా..?

ఈ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్‌ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు. అయితే కోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం విశేషం. కేసు విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది. 


Tags:    
Advertisement

Similar News