నన్ను వదిలేయండ్రా బాబు.. నేను బతికే ఉన్నా..

సెలబ్రిటీలు, సీనియర్ రాజకీయ నాయకుల చావు వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంటాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి ఫేక్ వార్తలు మరింతగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఏది అసలైన వార్తో.. ఏది ఫేక్ వార్తో అర్థం కాని అయోమ‌య పరిస్థితి ప్ర‌జ‌ల‌కు ఏర్ప‌డుతోంది. దీంతో స్వయంగా బాధితులు వచ్చి.. క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రావడం లేదు. ఇలాంటి ఫేక్ వార్తే ఒకటి ఈ మధ్య చక్కర్లు కొట్టింది. టాలీవుడ్‌లో […]

Advertisement
Update: 2022-05-03 04:45 GMT

సెలబ్రిటీలు, సీనియర్ రాజకీయ నాయకుల చావు వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంటాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి ఫేక్ వార్తలు మరింతగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఏది అసలైన వార్తో.. ఏది ఫేక్ వార్తో అర్థం కాని అయోమ‌య పరిస్థితి ప్ర‌జ‌ల‌కు ఏర్ప‌డుతోంది. దీంతో స్వయంగా బాధితులు వచ్చి.. క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రావడం లేదు.

ఇలాంటి ఫేక్ వార్తే ఒకటి ఈ మధ్య చక్కర్లు కొట్టింది. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన కవిత చనిపోయిందంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 'ఆమె చనిపోయింది.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తనువు చాలించింది' అంటూ ఫేక్‌న్యూస్ క్రియేట్ చేశారు.

ఈ వార్తలపై స్వయంగా కవిత స్పందించారు. ‘నేను చనిపోయానంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇవి చూసి నా బంధువులు, స్నేహితులు చాలా అప్‌సెట్ అయ్యారు. నిజంగానే నాకు ఏదో జరిగింది అనుకొని మాకు కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు వెంటనే డిలీట్ చేయండి. లేకపోతే నేను చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాను’ అంటూ కవిత వార్నింగ్ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News