టీడీపీకి రమణ రాజీనామా.. టీఆర్​ఎస్​లో చేరుతున్నట్టు ప్రకటన

టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను త్వరలో టీఆర్​ఎస్​లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగాను. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. సామాజిక చైతన్యం కోసం సీఎం […]

Advertisement
Update: 2021-07-09 04:29 GMT

టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను త్వరలో టీఆర్​ఎస్​లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో టీఆర్​ఎస్​లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగాను. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. సామాజిక చైతన్యం కోసం సీఎం కేసీఆర్​ ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే నేను టీఆర్​ఎస్​లో చేరుతున్నాను.

కరోనా కట్టడిలోనూ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేయడంలో సీఎం కేసీఆర్​ ఎంతో పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఆయన పిలుపుతో నేను టీఆర్​ఎస్​లో చేరుతున్నాను. కార్యకర్తలతో సమావేశమై వారి అభీష్టం మేరకే టీఆర్​ఎస్​లో చేరాలని నిర్ణయించుకున్నాను’ అంటూ రమణ సోషల్ మీడియాలో ఓ పోస్ట్​ పెట్టారు.

ఇక రమణ గురువారం ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు వీరు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రమణ మాజీ సహచరుడు ఎర్రబెల్లి దయాకర్​రావు కూడా వెంట ఉన్నారు. అయితే సముచిత స్థానం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అనంతరమే రమణ.. టీఆర్​ఎస్​లో చేరినట్టు సమాచారం.

త్వరలో ఎమ్మెల్సీల నియామకం చేపట్టనున్నారు. ఈ క్రమంలో రమణ తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారట. అందుకు సీఎం కేసీఆర్​ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​ అభ్యర్థిగా రమణ పోటీచేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్​ వ్యూహాత్మకంగా రమణను టీఆర్​ఎస్​లో చేర్చుకున్నట్టు సమాచారం.

ఇటీవల ఈటల రాజేందర్​ టీఆర్​ఎస్​ను వీడిన విషయం తెలిసిందే. ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడం.. రాజీనామా చేయడంతో.. బీసీ వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొన్నది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు రమణను చేర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రమణ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన చేరికతో తమకు నేతన్నల అండదండలు ఉంటాయని కేసీఆర్​ భావిస్తున్నారట.

Tags:    
Advertisement

Similar News