ఆ రెండు సినిమాలతో ప్రయోగాలు

తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు అనుమతులు రావడంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. అయితే ప్రయోగాత్మకంగా కొన్ని సినిమాల్ని రిలీజ్ చేసి రిజల్ట్ చూడాలనుకుంటున్నారు. అందుకే బడా సినిమాలేవీ బరిలోకి రావడం లేదు. ఇందులో భాగంగా అన్నింటికంటే ముందుగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి పోటీగా సుమంత్ నటించిన కపటధారి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సాయితేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సర్వహక్కుల్ని జీ గ్రూప్ సంస్థ […]

Advertisement
Update: 2020-11-25 02:00 GMT

తెలంగాణలో థియేటర్లు తెరిచేందుకు అనుమతులు రావడంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. అయితే ప్రయోగాత్మకంగా కొన్ని సినిమాల్ని రిలీజ్ చేసి రిజల్ట్ చూడాలనుకుంటున్నారు. అందుకే బడా సినిమాలేవీ బరిలోకి రావడం లేదు. ఇందులో భాగంగా అన్నింటికంటే ముందుగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు దీనికి పోటీగా సుమంత్ నటించిన కపటధారి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

సాయితేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా సర్వహక్కుల్ని జీ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థే థియేట్రికల్ రిలీజ్ కూడా చేస్తోంది. డిసెంబర్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి వారం రోజుల గ్యాప్ లో సుమంత్ నటించిన కపటధారి సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ రెండు సినిమాల ఫలితాలు చూసిన తర్వాత అప్పుడు మిగతా సినిమాల్ని షెడ్యూల్ చేయాలని టాలీవుడ్ పెద్దలు నిర్ణయించారు.

థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. మరోవైపు ప్రభుత్వం కరెంట్ బిల్లులు మాఫీ చేసినప్పటికీ, థియేటర్లు తెరిస్తే తిరిగి నష్టాలు రావడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎన్ని సింగిల్ స్క్రీన్స్ తెరుచుకుంటాయనేది అంతుచిక్కకుండా ఉంది.

మరోవైపు వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు)లో వందశాతం మినహాయింపు ఇస్తూ క్యూబ్ లాంటి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్ ను ఎంతమంది తెరుస్తారు, తెరిస్తే ఎంతమంది ప్రేక్షకులు వస్తారనే అంచనాలు ఎవ్వరికీ అందడం లేదు. చివరికి సురేష్ బాబు లాంటి పెద్ద ప్లేయర్ కూడా తన థియేటర్లను తెరవడానికి ముందుకురావడం లేదు.

Advertisement

Similar News