నాని బాలీవుడ్ కు వెళ్తాడా?

ఈ లాక్ డౌన్ టైమ్ లో నానిపై వచ్చిన విచిత్రమైన పుకారు ఇది. తన సూపర్ హిట్ సినిమాల రీమేక్స్ తో ఈ నేచురల్ స్టార్ బాలీవుడ్ కు వెళ్తాడనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పుకార్లను ఎక్కువ రోజులు బతకనీయలేదు ఈ హీరో. వెంటనే ఖండించాడు. V సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని, తనకు బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదని కరాఖండింగా చెప్పేశాడు. తను తెలుగు వాడినని, ఇక్కడే […]

Advertisement
Update: 2020-09-04 22:05 GMT

ఈ లాక్ డౌన్ టైమ్ లో నానిపై వచ్చిన విచిత్రమైన పుకారు ఇది. తన సూపర్ హిట్ సినిమాల రీమేక్స్ తో ఈ నేచురల్ స్టార్ బాలీవుడ్ కు వెళ్తాడనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పుకార్లను ఎక్కువ రోజులు బతకనీయలేదు ఈ హీరో. వెంటనే ఖండించాడు.

V సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాని, తనకు బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదని కరాఖండింగా చెప్పేశాడు. తను తెలుగు వాడినని, ఇక్కడే సినిమాలు చేస్తానని స్పష్టంచేశాడు.

నిజానికి తెలుగు వాడు అయినంత మాత్రాన బాలీవుడ్ లో ట్రై చేయాలని లేదు. రామ్ చరణ్ లాంటి ఎంతోమంది హీరోలు హిందీలో ఓ రాయి వేసి చూశారు. కానీ ఈ విషయంలో నాని లాజిక్ మరోలా ఉంది. తన కథల సెలక్షన్ బాలీవుడ్ ట్రెండ్ కు సెట్ కాదనేది ఇతడి వాదన. తన ట్రాక్ నుంచి పక్కకొచ్చి మరీ బాలీవుడ్ కోసం కథలు చేయాల్సి ఉంటుందని, అప్పుడది తనకు ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నాడు. నాని చెప్పినదాంట్లో కూడా లాజిక్ ఉంది.

Advertisement

Similar News