అఖిల్ సినిమాలో సమంత ఉందా?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా అటు అఖిల్ కు, ఇటు బొమ్మరిల్లు భాస్కర్ కు చాలా కీలకం. సినిమా ఫ్లాప్ అయితే అఖిల్ కెరీర్ లో వరుసగా నాలుగో ఫ్లాప్ వస్తుంది. అటు బొమ్మరిల్లు భాస్కర్ ఇక ఇంటికెళ్లిపోవచ్చు. అలాంటి లైఫ్ అండ్ డెత్ సినిమా ఇది. అందుకే ఏ చిన్న అంశంలో కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కీలక పాత్ర కోసం సమంతను […]

Advertisement
Update: 2019-12-22 06:28 GMT

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా అటు అఖిల్ కు, ఇటు బొమ్మరిల్లు భాస్కర్ కు చాలా కీలకం. సినిమా ఫ్లాప్ అయితే అఖిల్ కెరీర్ లో వరుసగా నాలుగో ఫ్లాప్ వస్తుంది. అటు బొమ్మరిల్లు భాస్కర్ ఇక ఇంటికెళ్లిపోవచ్చు. అలాంటి లైఫ్ అండ్ డెత్ సినిమా ఇది. అందుకే ఏ చిన్న అంశంలో కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కీలక పాత్ర కోసం సమంతను తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్.

బొమ్మరిల్లు సినిమాలో ఓపెనింగ్ లోనే సిద్దార్థ్ కు ఓ అమ్మాయి లిఫ్ట్ ఇస్తుంది. ఆమెకు తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెబుతుంటాడు సిద్ధూ. సరిగ్గా అలాంటి సన్నివేశాన్నే కొత్త సినిమాలో కూడా క్రియేట్ చేస్తున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆ సన్నివేశంలో అఖిల్ కు సమంత లిఫ్ట్ ఇస్తుంది. ఆమెకు అఖిల్ తన గతం మొత్తం చెబుతుంటాడు. ఇక్కడితో ఆగకుండా, కథలో ఓ కీలకమైన పరిస్థితిలో సమంత చెప్పిన సలహాను అఖిల్ పాటిస్తాడు. అది సినిమాకు టర్నింగ్ పాయింట్ అంటున్నారు.

సరిగ్గా ఇలాంటి సన్నివేశం గీతగోవిందంలో కూడా ఉంది. నిత్యామీనన్ కు సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం నిత్యామీనన్ కు తన కథ మొత్తం చెబుతాడు. క్లైమాక్స్ లో ఆమె చెప్పిన సలహా ఆధారంగానే వెళ్లి తన బావ కాళ్లు పట్టుకుంటాడు. అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ఈ రెండు సిచ్యుయేషన్స్ ను వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News