బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ

బాలయ్యకు బాలీవుడ్ హీరోయిన్లు కొత్త కాదు. కత్రినాకైఫ్ నుంచి సోనాల్ చౌహాన్ వరకు చాలామంది హిందీ హీరోయిన్లతో కలిసి నటించాడు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. క్రేజ్ లేని హీరోయిన్లు మాత్రం బాలయ్య సరసన కనిపించారు. గతంలో కత్రినాకైఫ్, బాలయ్యతో సినిమా చేసినా అప్పటికి ఆమెకు ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఫస్ట్ టైమ్, కాస్త క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్ బాలయ్య సినిమాలో కనిపించబోతోంది. ఆమె పేరు సోనాక్షి సిన్హా. అవును.. బాలయ్య-బోయపాటి […]

Advertisement
Update: 2019-12-15 19:30 GMT

బాలయ్యకు బాలీవుడ్ హీరోయిన్లు కొత్త కాదు. కత్రినాకైఫ్ నుంచి సోనాల్ చౌహాన్ వరకు చాలామంది హిందీ హీరోయిన్లతో కలిసి నటించాడు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. క్రేజ్ లేని హీరోయిన్లు మాత్రం బాలయ్య సరసన కనిపించారు.

గతంలో కత్రినాకైఫ్, బాలయ్యతో సినిమా చేసినా అప్పటికి ఆమెకు ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఫస్ట్ టైమ్, కాస్త క్రేజ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్ బాలయ్య సినిమాలో కనిపించబోతోంది. ఆమె పేరు సోనాక్షి సిన్హా.

అవును.. బాలయ్య-బోయపాటి సినిమాలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హాను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తిచేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య సరసన ఆమె నటించే అవకాశం ఉంది. ఎందుకంటే, సౌత్ సినిమా సోనాక్షికి కొత్తకాదు. గతంలో ఆమె రజనీకాంత్ సరసన చేసింది. తెలుగులో మాత్రం ఆమెకిదే ఫస్ట్ టైమ్.

బాలయ్య-బోయపాటి సినిమా ఇప్పటికే లాంఛ్ అయింది. ప్రాధమికంగా ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలు అనుకుంటున్నారు. సోనాక్షి కూడా వచ్చి చేరితే బడ్జెట్ మరో 5 కోట్లు అదనంగా పెరిగే ఛాన్స్ ఉంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News