అవును.. నా సినిమా రీమేక్

ఈమధ్య రీమేక్ చేస్తే చెప్పడం లేదు. చెబితే పరువు పోతుందని కాదు, ఒరిజినల్ సినిమాను అంతా చూసేస్తున్నారు. రాబోయే సినిమాతో కంపేర్ చేస్తున్నారు. దీని వల్ల లేనిపోని నెగెటివ్స్ అన్నీ బయటపడుతున్నాయి. అందుకే రీమేక్ అనే విషయాన్ని బయటపెట్టడం లేదు. రాజ్ తరుణ్ కూడా అలానే చేయాలనుకున్నాడు. ఇద్దరి లోకం ఒకటే సినిమాను స్ట్రయిట్ సినిమాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మీడియా మాత్రం వదల్లేదు. ఇదే విషయంపై ఈ కుర్రహీరోను గుచ్చిగుచ్చి అడిగింది. దీంతో […]

Advertisement
Update: 2019-12-16 08:39 GMT

ఈమధ్య రీమేక్ చేస్తే చెప్పడం లేదు. చెబితే పరువు పోతుందని కాదు, ఒరిజినల్ సినిమాను అంతా చూసేస్తున్నారు. రాబోయే సినిమాతో కంపేర్ చేస్తున్నారు. దీని వల్ల లేనిపోని నెగెటివ్స్ అన్నీ బయటపడుతున్నాయి. అందుకే రీమేక్ అనే విషయాన్ని బయటపెట్టడం లేదు.

రాజ్ తరుణ్ కూడా అలానే చేయాలనుకున్నాడు. ఇద్దరి లోకం ఒకటే సినిమాను స్ట్రయిట్ సినిమాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మీడియా మాత్రం వదల్లేదు. ఇదే విషయంపై ఈ కుర్రహీరోను గుచ్చిగుచ్చి అడిగింది. దీంతో ఒప్పుకోక తప్పలేదు. అవును.. నా సినిమా రీమేక్ అంటున్నాడు రాజ్ తరుణ్.

“ఇద్ద‌రి లోకం ఒక‌టే' స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌. నాలుగైదు జోన‌ర్స్ క‌లిపి చేసిన సినిమా కాదు. సినిమా అంతా ప్రేమే ఉంటుంది. ట‌ర్కీష్ సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా చేశాం. అందులో ఎమోష‌న్స్‌ను మ‌న‌కు త‌గిన‌ట్లు మార్చి ఈ సినిమా చేశాం. ముందు స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్న త‌ర్వాత బెక్కం వేణుగోపాల్‌గారు, మా డైరెక్ట‌ర్ జీఆర్‌.కృష్ణ న‌న్ను 'ల‌వ్ లైక్స్ కో ఇన్‌సిడెన్సెస్‌' చూడ‌మ‌న్నారు. స‌రేన‌ని చూశాను. నాకు బాగా న‌చ్చింది. సినిమాకు నేను చూసిన త‌ర్వాత స్క్రిప్ట్‌ను నెరేట్ చేశారు. మాతృక‌లోని ఫీల్‌ను మిస్ చేయ‌కూడ‌ద‌ని చాలా జాగ్ర‌త్త‌గా సినిమా చేశాం. ఈడోర‌కం ఆడోర‌కం త‌ర్వాత నేను చేసిన రీమేక్ మూవీ ఇది.”

ఇలా తన సినిమా రీమేక్ అనే విషయాన్ని అంగీకరించాడు రాజ్ తరుణ్. షాలినీ పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలకాబోతోంది.

Tags:    
Advertisement

Similar News