మహ్మద్ అజరుద్దీన్ కల నిజమాయెగా...!

రాజీవ్ స్టేడియంలో అజర్ పేరుతో స్టాండ్ అజర్ స్టాండ్ ను ఆవిష్కరించిన లక్ష్మణ్ భారత, హైదరాబాద్ క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాజీ కెప్టెన్ అజరుద్దీన్ పేరుతో ఎట్టకేలకు ఓ స్టాండ్ ప్రారంభమయ్యింది. భారత్ తరపున 99 టెస్టులు ఆడటంతో పాటు పలు అసాధారణ రికార్డులు నెలకొల్పిన అజర్ గౌరవార్థం…స్టేడియంలోని ఉత్తరభాగంలోని స్టాండ్ […]

Advertisement
Update: 2019-12-07 01:36 GMT
  • రాజీవ్ స్టేడియంలో అజర్ పేరుతో స్టాండ్
  • అజర్ స్టాండ్ ను ఆవిష్కరించిన లక్ష్మణ్

భారత, హైదరాబాద్ క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిన మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాజీ కెప్టెన్ అజరుద్దీన్ పేరుతో ఎట్టకేలకు ఓ స్టాండ్ ప్రారంభమయ్యింది. భారత్ తరపున 99 టెస్టులు ఆడటంతో పాటు పలు అసాధారణ రికార్డులు నెలకొల్పిన అజర్ గౌరవార్థం…స్టేడియంలోని ఉత్తరభాగంలోని స్టాండ్ కు మహ్మద్ అజరుద్దీన్ స్టాండ్ గా హైదరాబాద్ క్రికెట్ సంఘం నామకరణం చేసింది.

అజర్ స్టాండ్ ను వెరీ వెరీ స్పషల్ వీవీఎస్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో భాగంగా నిర్వహించిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు హైదరాబాదీ మాజీ క్రికెటర్లు సైతం పాల్గొన్నారు.

ఇదో గొప్ప గౌరవం- అజరుద్దీన్..

హైదరాబాద్ స్టేడియంలో తన పేరుతో ఓ స్టాండ్ ను ఏర్పాటు చేయడం తనకు గొప్పగౌరవమని, తాను ఎప్పుడు హైదరాబాద్, భారత క్రికెట్ గౌరవం కోసమే ఆడుతూ వచ్చానని హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు అజరుద్దీన్ చెప్పాడు. హైదరాబాద్ క్రికెట్ ఉన్నతి కోసం తాను అహర్నిశలూ పాటుపడతానని తెలిపాడు.

హైదరాబాద్ వేదికగా డిసెంబర్ 11న జరగాల్సిన టీ-20 మ్యాచ్ ను వారంరోజుల ముందుగానే నిర్వహించడం తమకు గర్వకారణమని, అందరి కృషితోనే ఇది సాధ్యమయ్యిందని అజర్ చెప్పాడు.

రానున్న కాలంలో మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్ లు రాజీవ్ స్టేడియంలో నిర్వహించడానికి తాము సిద్ధమని ప్రకటించాడు.

60 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన రాజీవ్ స్టేడియంలో ఇప్పటికే శివలాల్ యాదవ్, లక్ష్మణ్ ల పేర్లతో పాటు…పలువురు మాజీ దిగ్గజాల పేర్లతో స్టాండ్లు ఏర్పాటుచేసిన సంగతి తెసిందే.

ఆలస్యంగా నైనా మహ్మద్ అజరుద్దీన్ లాంటి దిగ్గజం పేరుతో హైదరాబాద్ క్రికెట్ సంఘం ఓ స్టాండ్ ను ఏర్పాటు చేసి తన క్రికెట్ స్ఫూర్తిని చాటుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News